: మోదీ కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయాలివే!


ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు... కరవు ప్రాంతాల్లో ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచారు. ఆకర్షణీయ గ్రామాల అభివృద్ధికి 5 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారు. ఎన్పీఎంఆర్ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే మూడేళ్లలో 300 పారిశ్రామిక కేంద్రాలలో అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ (రూరల్-అర్బన్) మిషన్ పథకానికి ఆమోదముద్ర వేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థ ఎన్ఎస్సీఎస్ పై ఐదేళ్ల పాటు నిషేధం విధించారు.

  • Loading...

More Telugu News