: ఎన్ కౌంటర్ మృతదేహాలకు కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టుమార్టం: వరంగల్ కోర్టు
వరంగల్ జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో చనిపోయిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించాలని జిల్లా కోర్టు ఆదేశించింది. జిల్లాలోని తాడ్వాయి మండలం నార్లాపూర్ అడవుల్లో పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తంగెళ్ల శృతి, మణికంటి విద్యాసాగర్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. అయితే వారి ఎన్ కౌంటర్ బూటకమంటూ ప్రజాసంఘాలు తీవ్రంగా ఆరోపించాయి. ఈ క్రమంలో కుటుంబసభ్యుల సమక్షంలో పోస్టుమార్టం జరపాలని కోర్టు ఆదేశించింది.