: రుషికొండలో ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం, స్థానికుల భయాందోళన


విశాఖ పరిధిలోని రుషికొండ బీచ్ సమీపంలో ఈ ఉదయం సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. అలలు 5 నుంచి 8 మీటర్లు ఎత్తునకు ఎగిసి పడుతున్నాయి. తీర ప్రాంతం భారీగా కోతకు గురి కావడంతో పాటు బీచ్ లోని విద్యుత్ స్తంభాలు సైతం నేలకు ఒరిగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనాల కారణంగానే అలల ఉద్ధృతి అధికంగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడమే మంచిదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News