: జగన్ కు మునుల శాపం ఉంది: పల్లె
ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా వైకాపా అధినేత జగన్ ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేరని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎద్దేవా చేశారు. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకున్నట్టు... ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రతి పనినీ జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు మునుల శాపం ఉందని... అందువల్లే ఆయన అలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. జగన్ ను ప్రజలు నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదని చెప్పారు. లక్షల కోట్లను అక్రమంగా సంపాదించిన జగన్ కు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, పేదలపై జగన్ కు ప్రేమాభిమానాలు లేవని... కేవలం పదవీ వ్యామోహంతోనే వివిధ కార్యక్రమాలు చేపడుతుంటారని విమర్శించారు.