: హైదరాబాద్ కు తరలిస్తున్న తాపేశ్వరం లడ్డూ
ఖైరతాబాద్ మహాగణపతి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన లడ్డూ తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి హైదరాబాదుకు బయలుదేరింది. ప్రత్యేక వాహనంలో దీనిని నగరానికి తీసుకువస్తున్నారు. ఈ సాయంత్రానికి లడ్డూ ఖైరతాబాద్ చేరుకోనుంది. గణపతికి 6వేల కిలోల లడ్డూను సురుచి సంస్థ తయారుచేసింది. ప్రతి ఏటా ఖైరతాబాద్ వినాయకునికి తాపేశ్వరం నుంచి లడ్డూ పంపుతున్న విషయం తెలిసిందే. అటు విశాఖ, విజయవాడలకు తరలించేందుకు కూడా తాపేశ్వరంలో భారీ లడ్డూలు సిద్ధమయ్యాయి. విశాఖలో మహాగణపతికి 8వేల కిలోల లడ్డూను, విజయవాడలో గణపతికి 6,300 కిలోల లడ్డూను భక్తాంజనేయస్వామి స్వీట్స్ సిద్ధం చేసింది.