: ఎన్టీఆర్ ఆశయాన్ని చంద్రబాబు నెరవేర్చారు: హరికృష్ణ
తన తండ్రి, దివంగత నందమూరి తారకరామారావు ఆశయాన్ని సీఎం చంద్రబాబు నెరవేర్చారని టీడీపీ నేత హరికృష్ణ అన్నారు. నదుల అనుసంధానం అనేది ఎన్టీఆర్ కల, ఆశయమని చెప్పారు. నేడు కృష్ణాజిల్లా ఫెర్రీలో కృష్ణా, గోదావరి జలాలు కలవబోతున్నాయి. ఈ అద్భుత ఘట్టం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏపీ ప్రభుత్వం వేడుకగా నిర్వహించేందుకు సిద్ధమైంది.