: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై తొలిసారి పంజా విసిరిన ఆస్ట్రేలియా


అత్యంత కిరాతకాలకు, దారుణాలకు ఒడిగడుతూ, ప్రపంచ శాంతికి తూట్లు పొడుస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై ఆస్ట్రేలియా సమరశంఖం పూరించింది. ఇంతవరకు సైలెంట్ గా ఉన్న ఆస్ట్రేలియా తొలిసారి ఐఎస్ స్థావరాలపై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. తాము దాడులు జరిపినట్టు ఆసీస్ రక్షణ శాఖ మంత్రి కెవిన్ ఆండ్రూస్ కూడా స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు చెందిన మందుగుండు సామాగ్రిని తరలిస్తున్న వాహనాన్ని ఓ ప్రత్యేక క్షిపణి ద్వారా ధ్వంసం చేసినట్టు చెప్పారు. ఐఎస్ ఉగ్రవాదులకు ఎక్కువ పట్టు ఉన్న తూర్పు సిరియా ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి. తాము జరిపే జెట్ యుద్ధ విమానాల దాడుల్లో సామాన్యులకు నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. మరోవైపు, ఉగ్రవాదులు జరిపే ఎదురు దాడులకు తమ యుద్ధ విమానాలు ధ్వంసం కావని, ఎలాంటి ప్రమాదాన్నైనా తమ జెట్ లు తట్టుకుంటాయని వెల్లడించారు. ఇప్పటికే ఇరాక్ లోని బాగ్దాద్ లో దాడులు జరుపుతున్నామని... తాజాగా, ఉగ్రవాదులను అణచివేసేందుకు జరిగిన ఒప్పందంలో భాగంగా... సిరియాకు సహకరించాలని ఈ దాడులు ప్రారంభించామని చెప్పారు.

  • Loading...

More Telugu News