: చంద్రబాబును అడ్డుకున్న భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటనకు అడ్డుగా నిలిచాయి. దీంతో పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కొన్ని గంటలు వాయిదా పడింది. వర్షాలు, దట్టమైన మేఘాల కారణంగా చంద్రబాబు పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 10 గంటలకల్లా పట్టిసీమ ప్రాంతానికి వెళ్లాల్సిన చంద్రబాబు బయలుదేరే పరిస్థితి లేదని అధికారులు తేల్చడంతో, తొలుత ఇబ్రహీంపట్నం వెళ్లి బహిరంగ సభలో పాల్గొనాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ తరువాత సాయంత్రం 3:45 గంటలకు పట్టిసీమ వెళ్లాలన్నది చంద్రబాబు అభిమతంగా తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు బాబు పర్యటనలో మార్పులు చేస్తున్నారు. మరికాసేపట్లో చంద్రబాబు ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్దకు చేరుకోనున్నారు.