: రూ. 35 వేల కోట్లతో కలియుగ రామ సేతువు!


ఇండియా, శ్రీలంకల మధ్య వ్యాపార, వాణిజ్య, ద్వైపాక్షిక బంధాల మెరుగు కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 'కలియుగ రామ సేతువు'ను నిర్మించాలని రెండు దేశాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. సుమారు రూ. 35 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టుపై లంక ప్రధాని రనిల్ విక్రమసింఘే, కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీలు చర్చించారు. తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకూ దాదాపు 22 కిలోమీటర్ల పొడవైన వంతెనను నిర్మించాలన్నది ఈ చర్చల్లో ముఖ్య సారాంశం. త్రేతాయుగంలో తన భార్యను అపహరించిన రావణుడిని వధించేందుకు వానరుల సహాయంతో రాముడు నిర్మించిన వంతెన (రామసేతు) కూడా ఇక్కడే ఉందన్నది పురాణ చరిత్రకారుల వాదన. ఈ ప్రాంతంలోని సముద్రంలో ఉన్న సున్నపు కొండలను తొలచి సముద్రమార్గాన్ని ఏర్పాటు చేయాలని పలు మార్లు ప్రయత్నించినా అది విఫలమైన సంగతి తెలిసిందే!

  • Loading...

More Telugu News