: సన్నీ లియాన్ దారిలోనే నడుస్తూ, ఇండియాపై ఆశలు పెంచుకుంటున్న మరో శృంగార నాయిక!


ఏ ముహూర్తాన 'బిగ్ బాస్'లో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చిందో కానీ, అప్పటివరకూ పెద్దల చిత్రాలకు మాత్రమే పరిమితమైన సన్నీ లియాన్ కు బాలీవుడ్ లో ఎంతో పేరొచ్చింది. చేతి నిండా అవకాశాలు దక్కడంతో, ఇక ఆ తరహా సినిమాలు చేయాల్సిన అగత్యం లేకుండాపోయింది. ఇప్పుడు అదే దారిలో నడవాలని వరల్డ్ టాప్ పోర్న్ స్టార్ లలో ఒకరైన మియా ఖలీఫా బావిస్తున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ తాజా సీజన్ లో పాల్గొనాలని ఇప్పటికే మియాకు ఆహ్వానం అందగా, ఆమె సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇండియాలో తనకు మరిన్ని అవకాశాలు, పాప్యులారిటీ, డబ్బు దక్కవచ్చన్నది ఆమె ఆలోచనగా తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె ఎంట్రీ వుంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కాగా, నీలిచిత్రాలలో నటించడాన్ని వృత్తిగా ఎంచుకున్నందుకు హతమారుస్తామంటూ మియా ఖలీఫాకు ఇప్పటికే పలుమార్లు బెదిరింపులు వచ్చాయి.

  • Loading...

More Telugu News