: ఇంద్రాణితో చనువుగా ఉండే వ్యక్తితో గడిపిన షీనా బోరా... పోలీసులు చేతికి ఫోటో ఆధారం!


సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పోలీసులకు మరిన్ని విషయాలు తెలిశాయి. ఇంద్రాణి ముఖర్జీతో చనువుగా ఉండే ఓ వ్యక్తితో షీనా బోరా గడిపినట్టున్న కొన్ని 'ప్రైవేట్' దృశ్యాలు పోలీసుల చేతికి చిక్కాయి. థాయ్ లాండ్ లోని ఓ బీచ్ రిసార్టులో తీసిన ఈ చిత్రాల్లో షీనా బోరా, ఆ వ్యక్తి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అభ్యంతరకరమైన భంగిమల్లో ఉన్న ఈ దృశ్యాలు కేసులో కొత్త విషయాలను వెలుగులోకి తేవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరికీ ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా పరిచయం ఏర్పడి వుండవచ్చని తెలుస్తోంది. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని ఇంద్రాణికి తెలుసునని సమాచారం. ఈ చిత్రాల విషయమై అధికారిక సమాచారం వెలువడనప్పటికీ, కేసులో పురోగతికి ఇవి సహకరిస్తాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News