: ఆ చిత్రం చూసి భయపడకుంటే రూ. 5 లక్షలు ఇస్తారట!


నిర్మాత సి.కల్యాణ్ అందిస్తున్న నయనతార తాజా చిత్రం 'మయూరి'ని చూసి భయపడకుండా ఉండే వాళ్లకు రూ. 5 లక్షలు బహుమతిగా ఇస్తారట. ఈ విషయాన్ని కల్యాణ్ స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాను ఒంటరిగా చూస్తూ బీపీ పెంచుకోని వాళ్లకు రూ. 5 లక్షలు ఇస్తామని ఆయన ప్రకటించారు. నయనతార తమిళంలో నటించిన 'మాయ' చిత్రాన్ని తెలుగులో 'మయూరి'గా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నయన్ ద్విపాత్రాభినయం చేసింది. ఇది ఓ ఆంగ్ల హారర్ చిత్రాన్ని చూసిన ఫీల్ ను కలిగిస్తుందని, అనుక్షణం ఉత్కంఠను కలిగిస్తూ, అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుందని కల్యాణ్ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News