: ఏపీకి తరలివచ్చిన సెల్ కాన్, మైక్రోమ్యాక్స్, కార్బన్


దేశవాళీ మొబైల్ దిగ్గజాలు మైక్రోమ్యాక్స్, సెల్ కాన్, కార్బన్ సంస్థలు చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో సెల్ ఫోన్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు ఏపీ సర్కారుతో ఈ మూడు కంపెనీలూ అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పరిశ్రమల శాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఆయా కంపెనీల ప్రతినిధులు సీఎం చంద్రబాబు సమక్షంలో డీల్స్ పై సంతకాలు చేశారు. ఈ మూడు సెల్ ఫోన్ కంపెనీలు ప్రారంభమైతే, 7 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు వివరించారు. విమానాశ్రయానికి దగ్గరగా పరిశ్రమలు ఉండాలని భావించిన తరువాతనే ఈ సంస్థలు చిత్తూరు జిల్లాను ఎంచుకున్నాయని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News