: తెలంగాణను మోసం చేస్తున్న బ్యాంకర్లు: విరుచుకుపడ్డ హరీష్ రావు, పోచారం
తెలంగాణలో రైతు రుణాలను మాఫీ చేసే విషయంలో బ్యాంకర్లు నిబంధనలకు తిలోదకాలు వదిలి రైతులను మోసం చేస్తున్నాయని మంత్రులు హరీష్ రావు, పోచారం విమర్శించారు. రుణాల మాఫీ అమలులో నిర్లక్ష్యం చూపుతున్నారని, రైతుల నుంచి వడ్డీలు వసూలు చేయరాదని చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ మేరకు 323 జీవో ఇచ్చినా పట్టించుకోవట్లేదని, రైతుల నుంచి వసూలు చేసిన వడ్డీ మొత్తాన్ని వారంలోగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ప్రభుత్వ సూచనలు పట్టించుకోకుంటే, బ్యాంకర్లకు సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. రైతుల పట్ల బ్యాంకర్లు సానుకూలంగా వ్యవహరించాలని, ఇప్పటికే పంటల బీమా విషయంలో తీవ్రంగా నష్టపోతున్న వీరిని ఆదుకోవాల్సి వుందని హరీష్ వ్యాఖ్యానించారు. బ్యాంకర్ల తీరు మారకుంటే, వారిపై కోర్టుకు వెళ్తామని అన్నారు.