: సింగపూర్ ఇచ్చిన అమరావతి ప్రణాళికలో మార్పులు


సింగపూర్ అధికారులు ఏపీ సర్కారుకు సమర్పించిన నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రణాళికలో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అర్బన్ ప్లానింగ్ నిపుణులు ఇచ్చిన సూచనల మేరకు ఈ మార్పులు చేయాలని సీఆర్డీయే అధికారులకు బాబు సూచించారు. ఏ మార్పులు చేయనున్నారన్న విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడిస్తూ, ఈ రీజియన్లో 8 జోన్లు ఉంటాయని, ఒక్కో జోన్ ను ఒక్కో రకంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. శాటిలైట్ మ్యాప్ లను పరిశీలించి చూస్తే, మాస్టర్ ప్లాన్ 7,420 చదరపు కి.మీ. రాగా, సర్వే నంబర్లతో పోల్చితే 7,317.15 చదరపు కి.మీ. మాత్రమే వచ్చిందని తెలిపారు. ఈ రీజియన్లో ఇప్పటికే 55.05 లక్షల మంది ప్రజలు ఉన్నారని, సమీప భవిష్యత్తులో ఈ సంఖ్య మరింతగా పెరగనుందని తెలిపారు. కొత్తగా ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు అనంతపురం ప్రాంతాల్లో పట్టణాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసేందుకు సీఎం ఆమోదం తెలిపారని నారాయణ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News