: మళ్లీ కెమేరా ముందుకు వస్తున్న స్టాలిన్


తమిళనాడులోని డీఎంకే పార్టీ నేత ఎంకే స్టాలిన్ మళ్లీ నటించనున్నారు. అయితే, సినిమాల్లో కాదు, ఎన్నికల ప్రచారం నిమిత్తం తీయనున్న లఘు చిత్రంలో. అన్నాడీఎంకే సర్కారు తీరు, దాని వైఫల్యాలను ఎండ గట్టడమే లక్ష్యంగా తీస్తున్న ఈ లఘు చిత్రం కోసం ఆయన మేకప్ వేసుకోనున్నారు. ఎన్నికల ప్రచారం, టీవీ ప్రకటనల నిమిత్తం ఒక ప్రత్యేక లఘు చిత్రాన్ని రూపొందించే పనిలోపడ్డ స్టాలిన్ ఇందులో తానే కీలక భూమిక పోషించనున్నారు. నటన అనేది ఆయనకు కొత్తేమీకాదు. ఎందుకంటే, 1987లో స్టాలిన్ తండ్రి, సినిమా మాటల రచయిత, డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రూపొందించిన 'ఒరే రక్తం' చిత్రంలో స్టాలిన్ నటించారు. ఆ సినిమాలో విప్లవ నాయకుడి పాత్రలో నటించిన స్టాలిన్ తన నటనాకౌశలంతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. నటనానుభవంతో రాజకీయానుభవమూ పుష్కలంగా కలిగి ఉన్న ఆయన నటించబోయే లఘు చిత్రం ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుందని డీఎంకే పార్టీ వర్గాలు అంటున్నాయి. అధికార పక్షంపై రుసరుసలాడుతున్న స్టాలిన్ తన లఘు చిత్రాన్ని నగర శివారులోని ఓ థీమ్ పార్క్ లో షూట్ చేస్తారట. కలైంజర్ టీవీ ద్వారా దీనిని తొలుత ప్రసారం చేస్తారు.

  • Loading...

More Telugu News