: స్టేజ్ పై మాట్లాడుతూ కూలపడ్డ బీఎండబ్ల్యు సీఈఓ
బీఎండబ్ల్యు సీఈఓ హెరాల్డ్ క్రూయిజర్ ఒక న్యూస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ వెనక్కి పడిపోయిన సంఘటన మంగళవారం జరిగింది. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో ఆటో షో పై జరుగుతున్న సమావేశంలో స్టేజ్ పై మాట్లాడుతుండగా ఉన్నట్టుండి ఆయన వెనక్కి పడిపోయారు. దీంతో ఆయన సహాయకులు, సిబ్బంది వెంటనే స్టేజ్ పైకి వెళ్లి ఆయనను లేవదీశారు. క్రూయిజర్ తన చేతులతో తల వెనుకభాగంలో రుద్దుకుంటూ, ఏం జరిగిందన్నట్టు దిమ్మరబోయి చూశారు. స్టేజ్ పై నుంచి ఆయనను తీసుకువెళ్లి ఉపచర్యలు చేశారు. హెరాల్డ్ మాట్లాడటం ప్రారంభించిన ఐదు నిమిషాల తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది.