: బాలీవుడ్ లో వాళ్లిద్దరి ఫిజిక్ బావుంటుందంటున్న సన్నీలియోన్


బాలీవుడ్ లో హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రాల శరీరాకృతి బాగుంటుందని శృంగార తార సన్నీ లియోన్ పేర్కొంది. వ్యాయామానికి సంబంధించిన సొంత వీడియో రూపొందించిన సన్నీ లియోన్, దాని డీవీడీని నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ, బాలీవుడ్ నటీనటుల్లో హృతిక్, ప్రియాంకల బాడీలు మాత్రమే బాగుంటాయని చెప్పింది. సినీ నటులు తెరమీద అందంగా కనిపించడానికి కారణం ఫిట్ నెస్సేనని తెలిపింది. ప్రస్తుతం 'మస్తీ జాదే' సినిమాలో నటిస్తున్నానని చెప్పిన సన్నీ లియోన్, ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో తుషార్ కపూర్, వీర్ దాస్, షాద్ రణధవా, సురేష్ మీనన్, వివేక్ విశ్వానీలు నటిస్తున్నారని చెప్పింది. రితేష్ దేశ్ ముఖ్ ఓ ప్రత్యేక పాత్రలో సందడి చేస్తాడని సన్నీ వివరించింది.

  • Loading...

More Telugu News