: ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా మాల్కం టర్న్ బుల్ ప్రమాణస్వీకారం


ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా మాల్కం టర్న్ బుల్ ప్రమాణస్వీకారం చేశారు. సంకీర్ణ కన్జర్వేటివ్ ప్రభుత్వాన్ని మరో రెండు సంవత్సరాల పాటు ఆయన నడిపించనున్నారు. మొన్నటివరకు ప్రధానిగా ఉన్న టోనీ అబాట్ పై సొంత పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని టర్న్ బుల్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిన్న(సోమవారం) నిర్వహించిన పార్టీ అంతర్గత ఎన్నికల్లో టర్న్ బుల్ కు 54 ఓట్లు, అబాట్ కు 44 ఓట్లు వచ్చాయి. దాంతో ప్రధాని పదవి నుంచి అబాట్ వైదొలగారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన టర్న్ బుల్ ఆస్ట్రేలియాకు 29వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

  • Loading...

More Telugu News