: ప్రకాశం జడ్పీ మాజీ ఛైర్మన్ హరిబాబుకు ఊరట
ప్రకాశం జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్ ఈదర హరిబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. జడ్పీటీసీగా హరిబాబుపై అనర్హత వేటు ప్రక్రియ సరిగ్గా లేదని కోర్టు వ్యాఖ్యానించింది. జడ్పీ ఛైర్మన్ గా ఈదర నియామకాన్ని గతంలో హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన జడ్పీ ఎన్నికల్లో అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈదర, ఒక్క ఓటు తేడాతో టీడీపీ అభ్యర్థిపై జడ్పీ ఛైర్మన్ గా ఎంపికయ్యారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కు టీడీపీ ఫిర్యాదు చేయడంతో హరిబాబు సభ్యత్వాన్ని రద్దు చేశారు. దాంతో ఆయన జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తూ వచ్చారు.