: కర్నూలు జిల్లాలో వజ్రం దొరికింది


వర్షాలు పడితే కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి, పెరవలి తదితర ప్రాంతాల్లో సందడి సందడిగా ఉంటుంది. వందలాది మంది భోజనాలు కట్టుకుని వచ్చి పొలాల్లో వజ్రాల కోసం అన్వేషణ జరుపుతారు. తమ కళ్లకు ఏదైనా రాయి తళుక్కుమనిపిస్తే, తమ పంట పండిందని గంతులేస్తారు. లేదంటే నిరాశతో వెనుదిరుగుతారు. తాజాగా జిల్లాలోని తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఈ రోజు వజ్రం దొరికింది. దాని సైజు, క్వాలిటీకి సంబంధించిన వివరాలు తెలియనప్పటికీ... సదరు వ్యక్తి దాన్ని ఓ వజ్రాల వ్యాపారికి రూ. 75 వేలకు విక్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వజ్రాన్ని అమ్మిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వజ్రాలు దొరికిన వ్యక్తుల నుంచి తక్కువ ధరకే స్థానిక వ్యాపారులు వాటిని కొనుగోలు చేస్తారు. అనంతరం, బహిరంగ మార్కెట్లో వాటిని ఎక్కువ ధరకు అమ్ముకుంటుంటారు.

  • Loading...

More Telugu News