: చలించిపోయిన రేవంత్ రెడ్డి... తక్షణమే వస్తున్నానంటూ ఫోన్


నల్గొండ జిల్లా దేవరకొండ మండలం చంద్రునాయక్ తండాలో టీడీపీ నేత రామావత్ చందూలాల్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. అత్యంత దారుణంగా జరిగిన ఈ దాడిలో చందూలాల్ కాళ్లను గొడ్డళ్లతో నరికారు. వెంటనే చందూలాల్ ను ఆయన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందూలాల్ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిని చూడాలని కలవరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి చలించిపోయారు. వెంటనే చందూలాల్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, తానున్నానంటూ ధైర్యం చెప్పారు. తక్షణమే బయలుదేరి వస్తున్నానంటూ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడానికి రేవంత్, ఎర్రబెల్లి, ఎల్.రమణ, మోత్కుపల్లి తదితర టీటీడీపీ కీలక నేతలు విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News