: పీవీకి భారతరత్న కోసం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సిఫారసు
దేశ మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహరావు పేరును అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇదే క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్, విద్యావేత్త రాంరెడ్డి పేర్లను పద్మవిభూషణ్, విద్యావేత్త చుక్కా రామయ్య పేరును పద్మశ్రీ పురస్కారాల జాబితాలో పేర్కొంది. వచ్చే సంవత్సరం జనవరి 26న ప్రకటించే పద్మ అవార్డులకు సంబంధించి ప్రతిపాదిత జాబితాను రాష్ట్రం నుంచి తెలంగాణ సర్కార్ కేంద్రానికి పంపించింది. దాదాపు 47 మంది పేర్లతో కూడిన ఆ జాబితాను సీఎస్ రాజీవ్ శర్మ ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదించింది.