: అంతా ఏపీలోనే ఉంది... తెలంగాణలో ఏమీ లేదు: గుత్తా


దేశంలో పారిశ్రామికంగా, వ్యాపారపరంగా ఎక్కువ అవకాశాలున్న రాష్ట్రాల్లో గుజరాత్ మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ వివరాలను సాక్షాత్తు ప్రపంచ బ్యాంకే విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. మొదటి నుంచి కూడా తాను ఏపీ బాగా అభివృద్ధి చెందిన ప్రాంతమనే వాదిస్తున్నానని గుర్తు చేశారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర ప్రాంతాల్లో పారిశ్రామిక వాతావరణం లేదని అన్నారు. ఏపీకి 940 కిలోమీటర్ల పొడవున తీరప్రాంతం ఉందని, ఓడ రేవులు ఉన్నాయని... అందుకే అక్కడకే పరిశ్రమలు ఎక్కువగా వస్తాయని చెప్పారు. అందుకే, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే, తెలంగాణకు కూడా ఇవ్వాలని తాను కోరుతున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News