: ఇషాంత్... దూకుడుగా ఉండు, కానీ ఎక్కడ తగ్గాలో తెలుసుకో!: రవిశాస్త్రి
భారత క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్ గా కీలక స్థానంలో ఉన్న ఇషాంత్ శర్మ తన దూకుడును కొనసాగించాలని, ఇదే సమయంలో ఎక్కడ తగ్గాలో కూడా తెలసుకోవాలని జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి సలహా ఇస్తున్నాడు. "ఇషాంత్ దూకుడుగా ఉంటే చూడాలని కోరుకునే వాళ్లల్లో నేనే ముందుంటా, కానీ, అతని హద్దులు కూడా అతను తెలుసుకోవాలి. తగ్గాల్సిన చోట తగ్గాలి" అని వ్యాఖ్యానించాడు. మొత్తం క్రికెట్ జట్టు అతనికి అండగా వుంటుందని వెల్లడించిన రవిశాస్త్రి, దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో అతను అందుబాటులో ఉండకపోవడం తీరని లోటేనని అభిప్రాయపడ్డాడు.