: ఆ సైనికుడి సాహసానికి ఘన నివాళులు!


దేశానికి హాని కలుగకుండా చూసే క్రమంలో మన జవాన్లు ఎంతటి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారో తెలియజెప్పేందుకు మరో ఉదాహరణ ఇది. సైన్యం కంటబడి తప్పించుకు పారిపోతున్న స్మగ్లర్ ను బంధించేందుకు నదిలో దూకి, కొంత దూరం ఈదిన తరువాత, నదీ ప్రవాహ ధాటికి మునిగి ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ జవాను సాహసాన్ని ఉన్నతాధికారులు అశ్రునయనాలతో కొనియాడుతున్నారు. ఈ ఘటన భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జరిగింది. ఇక్కడ ఉన్న ఓ నదిలో దూకి స్మగ్లర్ పారిపోతుండగా, బీఎస్ఎఫ్ కు చెందిన కమాండర్ ప్రశాంత్ రాయ్ వెంబడించాడు. నదిలో దూకి, అతన్ని వెంబడించే క్రమంలో వీరమరణం పొందాడు. అతని మృతదేహాన్ని వెలికితీసిన ఇతర జవాన్లు ఘన నివాళులు అర్పించారు.

  • Loading...

More Telugu News