: కోచ్ ద్రవిడ్ ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించిన జట్టు
భారత A జట్టు శిక్షణ ప్రారంభించింది. టీమిండియా దిగ్గజ ఆటగాడు, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ సారధ్యంలో భారత 'ఏ' జట్టు ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆటగాళ్ల బ్యాటింగ్ ను దగ్గర్నుంచి పరిశీలించిన ద్రవిడ్ వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందజేశాడు. టీమిండియాలో ద్రవిడ్ తో కలిసి ఆడిన సురేష్ రైనా, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా భారత 'ఏ' జట్టులో చోటు సంపాదించుకోవడం విశేషం. కాగా, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, కోచ్ గా ద్రవిడ్ పని చేసిన సంగతి తెలిసిందే. కాగా, ద్రవిడ్ కోచింగ్ పై మాజీలు గతంలోనే విశ్వాసం వ్యక్తం చేశారు. టీమిండియా కోచ్ పగ్గాలు ద్రవిడ్ కు అప్పగించాలని గతంలోనే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రవిశాస్త్రి పదవిని మరో ఏడాది పెంచుతూ, ద్రవిడ్ ను భారత్ 'ఏ' జట్టు కోచ్ గా బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ద్రవిడ్ జూనియర్లతో మంచి ప్రదర్శన రాబడితే కోచ్ గా ప్రమోషన్ లభిస్తుందనడంలో సందేహం లేదు.