: ఐఎస్ఐఎస్ భారత్ లో ఎలా పాగా వేయాలనుకుంటోందో తెలుసా?
ఐఎస్ఐఎస్ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతోంది. భారత్ లో పాగా వేసేందుకు సోషల్ మీడియాను వాడుకుంటోంది. కొందరు వ్యక్తుల ఫోన్ నెంబర్లను సేకరించి, వారికి వాట్స్ యాప్ లో మెసేజ్ లు పంపుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముందుగా 'నీవు దవాతుల్ ఇస్లాం దవా గ్రూపులో చేరావంటూ' మెసేజ్ పంపుతుంది. మీరు మా కాంటాక్ట్ లిస్టులో ఉన్నారని చెబుతుంది. మీరే మమ్మల్ని కాంటాక్ట్ చేశారంటుంది. తర్వాత ఇక ఆ ఉచ్చులో పడ్డారా? ఇంక అంతే...! అలా కాకుండా మనకు సంబంధంలేని వారితో మనకు మాటలేంటి అని క్లియర్ గా కట్ చేస్తే...మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టే. కోచిలో కొంత మంది విద్యార్థులను ఇలాగే ఐఎస్ఐఎస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించింది. దాంతో ఆ యువకులు చేసిన ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు, కేసు నమోదు చేసి, దాని అడ్మిన్ కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. స్నేహితులతో సంబంధం పెంచుకునేంతవరకు సోషల్ మీడియా ఓకే... దానిని దేశ విద్రోహ చర్యలకు వాడితే మాత్రం తీవ్ర ప్రమాదంలో పడ్డట్టే!