: సమ్మెకు సై అంటున్న పైలట్లు
కేంద్ర కార్మిక శాఖ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎయిర్ ఇండియా పైలట్లు సమ్మెకు దిగనున్నారు. ఫ్లైట్ కమాండర్లను వర్క్ మెన్ జాబితా నుంచి తొలగిస్తూ కార్మిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు అసోసియేషన్ ఐసీపీఏ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కె. కీర్తి తెలిపారు. సమ్మెకు అసోసియేషన్ కు చెందిన నాలుగు విభాగాలు పూర్తి మద్దతు తెలిపినట్లు ప్రవీణ్ చెప్పారు. ఎయిర్ ఇండియాలో మొత్తం 3,500 మంది క్యాబిన్ క్రూ సిబ్బంది ఉన్నారు. ఇందులో 2,200 మంది శాశ్వత ఉద్యోగులు కాగా మిగిలిన వారు కాంట్రాక్టు ఉద్యోగులు.