: గద్వాల్ ను జిల్లాగా ఏర్పాటు చేయండి: ప్రభుత్వానికి డీకే అరుణ విజ్ఞప్తి
మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఈరోజు ఆమె కలిశారు. అభివృద్ధి చెందడానికి అన్ని అర్హతలున్నప్పటికీ గద్వాల ప్రాంతం వెనకబడిందని తెలిపారు. జిల్లా ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు గద్వాల్ కు ఉన్నాయని, జిల్లాగా ఏర్పాటు చేయాలని గద్వాల్ ప్రాంత ప్రజలంతా కోరుకుంటున్నట్టు అరుణ పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనకు ప్రభుత్వం కమిటీ వేయబోతున్న నేపథ్యంలో ఆమె సీఎస్ ను కలిశారు.