: ఫాంహౌస్ ముందు, వెనుక ఆత్మహత్యలు జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదు: నాగం


టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కేసీఆర్ మాత్రం చైనాలో విహారయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తన ఫాంహౌస్ ముందు, వెనుక రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని... అలాంటి కేసీఆర్ కు రైతునని చెప్పుకునే అర్హత కూడా లేదని అన్నారు. రైతు ఆత్మహత్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని కరవు మండలాలను ప్రకటించి ఉంటే, కేంద్రం నుంచి సాయం వచ్చుండేదని... కేసీఆర్ ప్రభుత్వం ఈ పని కూడా చేయలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News