: ముంబై వాసుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న గణనాథుడి ప్రతిమ
వినాయకచవితి సందర్భంగా భక్తులు వినూత్నంగా వినాయకుడి విగ్రహాలు పెట్టాలని భావిస్తున్నారు. వారి ఆశలకు అనుగుణంగా గణనాథుడు కొలువుదీరుతున్నాడు. వినాయకుడు సంప్రదాయ రీతుల్లోనే కాకుండా లేటెస్ట్ ట్రెండ్స్ ను సైతం సంతరించుకోవడం విశేషం. 'బాహుబలి' వినాయకుడు తెలుగు అభిమానులను ఆకర్షిస్తుండగా, ముంబైలో సెల్ఫీ వినాయకుడి విగ్రహం అందర్నీ ఆకట్టుకుంటోంది. తమ్ముడు కుమార స్వామి, తండ్రి శివుడు, తల్లి పార్వతీదేవిలతో సెల్ఫీ తీయించుకుంటున్న గణనాధుడి విగ్రహం పలువుర్ని ఆకట్టుకుంటోంది. ఈ సెల్ఫీ వినాయకుడి ఫోటోను కరణ్ తల్వార్ అనే వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, దీనిని బాలీవుడ్ నటి, ఆప్ నేత గుల్ పనాగ్ షేర్ చేశారు. అంతే, ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.