: భారత సంతతి వ్యక్తికి ‘బాన్’ నగర మేయర్ పగ్గాలు
జర్మనీలోని ప్రముఖ నగరం బాన్ మేయర్ గా భారత సంతతికి చెందిన అశోక్ శ్రీధరన్ ఎన్నికయ్యారు. క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (సీడీయు) పార్టీ తరపున బరిలోకి దిగిన అశోక్ పూర్తి స్థాయి మెజార్టీని సాధించారు. ఒక ప్రముఖ నగరానికి భారత సంతతికి చెందిన వ్యక్తి మేయర్ పదవిని పొందడం ఇదే ప్రథమం. నలభై తొమ్మిది సంవత్సరాల శ్రీధరన్ సాధించిన విజయంతో గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా బాన్ నగరాన్ని పాలిస్తున్న సోషల్ డెమోక్రాటిక్ పార్టీ (ఎస్పీడీ)కి చెక్ పెట్టినట్లయింది. అక్టోబర్ 21వ తేదీన బాన్ నగర మేయర్ బాధ్యతలను శ్రీధరన్ స్వీకరించనున్నారు. కాగా, శ్రీధరన్ తండ్రి ఇండియన్ కాగా తల్లి జర్మన్ దేశస్థురాలు.