: చిన్నారికి పరిహారం చెల్లిస్తామంటున్న ఫేస్ బుక్
ఫేస్ బుక్ ఖాతా తెరవాలంటే సదరు వ్యక్తికి 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి. అయితే లండన్ కు చెందిన 11 ఏళ్ల చిన్నారికి ఫేస్ బుక్ అకౌంట్ ఇచ్చి, ఆమె లైంగిక వేధింపుల బారినపడేందుకు కారణమైంది. దీంతో ఆ బాలిక తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో స్పందించిన ఫేస్ బుక్ యాజమాన్యం న్యాయస్థానం వెలుపల వారితో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందం ఎంతకు అనేది ఇరు వర్గాలు వెల్లడించలేదు. ఏది మంచి? ఏది చెడు? అని నిర్ణయించుకోలేని వయసులో సదరు బాలిక తన అసభ్య ఫోటోలను ఆన్ లైన్ లో పోస్టు చేసిందని బాలిక తరపు న్యాయవాది న్యాయస్థానికి దాఖలు చేసిన పత్రాల్లో తెలిపారు. అనేక అకౌంట్లు ఏర్పాటు చేసి, చాలా మంది మగవాళ్లను కాంటాక్ట్ చేసిందని ఆ పత్రాల్లో వివరించారు. ఈ ఘటన ద్వారా వయసు నియంత్రణను ఫేస్ బుక్ పట్టించుకోవడం లేదని, యూజర్లు తమ వయసును తప్పుగా పేర్కొన్నా దానిని నియంత్రించేందుకు ఎలాంటి వ్యవస్థ లేదని ఆరోపించారు. దీంతో దిగివచ్చిన ఫేస్ బుక్ యాజమాన్యం న్యాయస్థానం వెలుపల ఆ కుటుంబంతో ఒప్పందం కుదుర్చుకుంది.