: ఈ ఫోటో కూడా హృదయాలను కదిలిస్తోంది... కానీ కథ మారింది!


గ్రీస్ వాసులు హాలిడేను ఎంజాయ్ చేసే ద్వీపం లెస్బోస్... దానికి 100 మీటర్ల దూరంలో శరణార్థులతో కిక్కిరిసి వస్తున్న డింగీ ఒకటి నీటిలో బోల్డా పడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, పదిహేను మంది బాలలు సహా మొత్తం 34 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలను కాపాడుకున్నారు. తీరానికి దగ్గరగా ఉండటంతో ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఇవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో శరణార్థుల అవస్థలను, చిన్న చిన్న పడవలు బోల్తా పడితే, వారి పరిస్థితిని కంటి ముందు నిలిపాయి. ఓ చిత్రంలో నిద్రపోతున్న తన రెండు నెలల బాలుడిని ట్యూబుపై పడుకోబెట్టి, దాన్ని ఓ చేత్తో ఒడిసి పట్టుకుని ఈదుతూ వస్తున్న ఓ సిరియా దేశ వాసి దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో పాటు మునిగిపోతున్న పడవ నుంచి సాయం చేయాలని వారు పెడుతున్న కేకలు, పడవ మునిగిపోగా, ఈదుతూ వస్తున్న శరణార్థులు, వారు తీరానికి చేరేందుకు పడ్డ పాట్లు వెలుగులోకి వచ్చాయి. కళ్లముందు కనిపిస్తున్నాయి. అయితే, సిరియన్ చిన్నారి అయిలాన్ కుర్దీ మాదిరిగా ఈ బాలుడి కథ విషాదాంతం కాకపోవడమే కొంత సంతోషాన్నిచ్చే అంశం.

  • Loading...

More Telugu News