: కారు ప్రమాదం నుంచి బయటపడ్డ జితన్ రామ్ మాంఝీ
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇంటి సమీపంలో మాంఝీ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి ప్రమాదం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పొత్తుల గురించి మాట్లాడటానికి అమిత్ షా ఇంటికి మాంఝీ వెళ్లారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కలసి పోటీచేయాలనే నిర్ణయానికి ఇరువురు వచ్చారు. అనంతరం, మాంఝీ తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.