: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.50వేలు ఇస్తాం: కోమటిరెడ్డి
తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. జిల్లాకు పదిమంది చొప్పున ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు రూ.50వేలు ఇస్తామని విలేకరులకు తెలిపారు. తన కుమారుడు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరపున మెదక్, నల్గొండ జిల్లాలో రైతులకు ఈ ఆర్థికసాయం అందజేస్తున్నట్టు ఎమ్మెల్యే వివరించారు. ఈ జిల్లాల్లో త్వరలో కోమటిరెడ్డి రైతు ఓదార్పు యాత్ర చేపట్టబోతున్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు 90 శాతం మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, తెలంగాణ ప్రభుత్వం, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆదుకోవాలని కోరారు.