: తెలంగాణ విమోచన దినోత్సవంపై మా పోరాటం ఆగదు: కిషన్ రెడ్డి


తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం దినోత్సవాన్ని జరపకపోయినా బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. అసలు ఈ అంశంపై కాంగ్రెస్ ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. వరంగల్ లో ఈ రోజు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎంఐఎం నిజాం వారసత్వ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలంటూ గత కొన్ని రోజుల నుంచి బీజేపీ డిమాండ్ చేస్తూనే ఉంది.

  • Loading...

More Telugu News