: హవాయికి రాంగ్ ప్లేన్ పంపిన అమెరికన్ ఎయిర్ లైన్స్... ఏదైనా జరిగుంటే..?


ఏదైనా ఒక రూట్ లో విమానాన్ని పంపాలంటే, అందుకు కొన్ని నిబంధనలను పాటించాల్సి వుంటుంది. ముఖ్యంగా సముద్రాలపై ప్రయాణించాల్సిన విమానాలకు మరిన్ని రక్షణ చర్యలు, అధిక ఇంధనం, ఆక్సిజన్, లైఫ్ జాకెట్లు ఉంచడం తప్పనిసరి. అయితే, అమెరికన్ ఎయిర్ లైన్స్ వీటన్నింటినీ మరిచి తప్పుడు విమానాన్ని లాస్ ఏంజిల్స్ నుంచి హవాయికి పంపి ఇబ్బందుల్లో పడింది. విమానానికి ఏం ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది కానీ, దురదృష్టవశాత్తు ఏదైనా జరిగుంటే... గత నెల 31న జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు యూఎస్ ఎయిర్ లైన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరిగిందో తమకు సైతం అంతు పట్డం లేదని అమెరికన్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి కాసే నార్టన్ వ్యాఖ్యానించారు. అదనపు పరికరాలు, రక్షణ వ్యవస్థ లేకుండా ఎయిర్ బస్ ఎ321 ఎస్ ప్రయాణం సాగించిందని, ఇకపై ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News