: అందాల నటికి ఆరు కోట్ల ఉంగరం బహుమతి
దక్షిణాది సినీ రంగంలో సత్తా చాటి, బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన అందాల నటి అసిన్. కొద్ది కాలంగా సరైన హిట్లు లేక డీలా పడ్డ ఈ ముద్దుగుమ్మ... ఇప్పుడు తన పెళ్లి వార్తలతో సందడి చేస్తోంది. రాహుల్ శర్మ అనే ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో పడ్డ అసిన్... చివరకు పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ఇంకా నిశ్చితార్థం జరగనప్పటికీ, ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పేశాయి. ఈ క్రమంలో, తన ప్రియురాలు అసిన్ కు అక్షరాలా రూ. 6 కోట్ల విలువైన వజ్రపుటుంగరాన్ని రాహుల్ బహుమతిగా ఇచ్చాడట. ఈ ఉంగరాన్ని బెల్జియంలో ప్రత్యేకంగా తయారు చేయించాడట. అంతేకాదు, తమ ఇద్దరి పేర్లు వచ్చేలా ఉంగరం మీద ఎ.ఆర్. అని పేరు కూడా వేయించాడు. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న అసిన్ చిత్రాలు పూర్తి కాగానే, వీరిద్దరి పెళ్లి జరగనుంది.