: కంబోడియాలో ఎంపీ కవిత వినాయకచవితి!
ఈ సంవత్సరం వినాయకచవితి పర్వదినాన్ని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కంబోడియాలో జరుపుకోనున్నారు. ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు ఆమె ఆ దేశంలో పర్యటించనుండటమే ఇందుకు కారణం. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ నేతృత్వంలో కంబోడియా, లావోస్ పర్యటనకు వెళ్తున్న బృందంలో ఆమె కూడా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కంబోడియా ప్రధాని డాక్టర్ హున్ సెన్ తో భారత బృందం సమావేశమవుతుంది. ఆ తరువాత దేశ పార్లమెంటును, కంబోడియాలోని ప్రసిద్ధ అంకోర్ వాట్ టెంపుల్ ను వీరు సందర్శిస్తారు. తిరిగి 18న భారత్ కు వస్తారని తెలుస్తోంది. కాగా, కంబోడియాలో వినాయక దేవాలయాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ సైతం ప్రజలు గణేశుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.