: పోలీసుల మాట వినుంటే, 16 ప్రాణాలు మిగిలేవి!


గండేపల్లి ఘోర ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, ప్రమాదానికి సరిగ్గా గంట ముందు పోలీసులకు పట్టుబడ్డాడట. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరుగగా, అంతకన్నా ముందు రహదారిపై తనిఖీలు చేస్తున్న పోలీసులు ఈ లారీని ఆపారు. లారీలో లోడ్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని, రాత్రి సమయంలో ఇంత లోడ్ తో వెళ్లడం మంచిది కాదని హెచ్చరించారట. కాస్త ముందుకెళ్లి లారీని నిలుపుతానని చెప్పిన డ్రైవర్, ఆగకుండా, అదే నిద్ర మత్తులో 35 మందిని ఎక్కించుకుని మరీ, యాక్సిడెంట్ చేశాడు. పోలీసుల మాట విని లారీని ఆపినా, లేదా పోలీసులే ఇంకాస్త గట్టిగా చెప్పి, లారీని అక్కడే నిలిపినా, 16 మంది ప్రాణాలు దక్కుండేవి.

  • Loading...

More Telugu News