: పూలు కోస్తున్న మహిళపై చైన్ స్నాచర్ దాడి... 6 తులాల బంగారు గొలుసు చోరీ
హైదరాబాదు శివారు ప్రాంతం వనస్థలిపురంలో నేటి ఉదయం చైన్ స్నాచర్ విరుచుకుపడ్డాడు. ఉదయాన్నే పూజ కోసం ఇంటి ముందు పూలు కోస్తున్న ఓ మహిళపై బైక్ పై వచ్చిన చైన్ స్నాచర్ మెరుపు దాడి చేశాడు. మహిళ మెడలోని 6 తులాల బంగారం గొలుసును పట్టుకుని లాగేశాడు. ఈ క్రమంలో మహిళ గొలుసును తెంచేసుకున్న చైన్ స్నాచర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పెనుగులాటలో మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో షాక్ తిన్న బాధితురాలు కటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చైన్ స్నాచర్ కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.