: ‘గండేపల్లి’ ఘటనపై జగన్ దిగ్భ్రాంతి... మృతులకు సంతాపం
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద అర్ధరాత్రి జరగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటే, వైసీీపీ నేత, ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ కొద్దిసేపటి క్రితం ఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు.