: ఫెడెక్స్ కు చెక్ పెట్టిన జకోవిచ్... హోరాహోరీ పోరులో నెం.1దే విజయం


‘ఫెడెక్స్’ గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే రోజర్ ఫెదరర్ కు ఇక గ్రాండ్ స్లామ్ అందేలా లేదు. కొద్దిసేపటి క్రితం యూఎస్ ఓపెన్ లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ లో టెన్నిస్ లో మేటి క్రీడాకారుడిగా ఎదిగిన అతడికి యువ సంచలనం, టాప్ సీడ్ నోవాన్ జకోవిచ్ చెక్ పెట్టారు. నాలుగు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో నోవాన్ జకోవిచ్ నే విజయం వరించింది. 6-4, 5-7, 6-4, 5-4 స్కోరుతో జకోవిచ్ యూఎస్ ఓపెన్ టైటిల్ ను ఎగరేసుకుపోయాడు. తొలి సెట్ ను కోల్పోయిన ఫెడెక్స్ మరుసటి సెట్లోనే పుంజుకున్నా ఫలితం లేకపోయింది. రెండో సెట్ ను ఫెడెక్స్ కు చేజార్చుకున్న జకోవిచ్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. మూడో సెట్ ను 6-4తో గెలుచుకున్న జకోవిచ్, నాలుగో సెట్ లోనూ పైచేయి సాధించి టైటిల్ విజేతగా నిలిచాడు.

  • Loading...

More Telugu News