: ‘మక్కా’ మృతుల్లో నలుగురు ఏపీ వాసులు...మచిలీపట్నం, కడపల్లో విషాద ఛాయలు


సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో మొన్న రాత్రి చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో నలుగురు ఏపీ వాసులు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆచూకీ లభించని కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఖాదర్, ఫాతిమా దంపతులు చనిపోయినట్లు నిన్న తేలింది. పిల్లలను ఇంటి వద్ద వదిలి పవిత్ర మక్కా యాత్రకు వెళ్లిన ఆ దంపతులు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో మచిలీపట్నంలో విషాదం నెలకొంది. మరోవైపు కడప నగరానికి చెందిన షమీన్, ఖాదర్ జీ లు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇక ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది భారతీయులు చనిపోయినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.

  • Loading...

More Telugu News