: హైదరాబాదు నుంచి గండేపల్లికి బయలుదేరిన ఏపీ హోం మినిస్టర్... వేగంగా స్పందించిన అధికారులు


తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న ఏపీ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హుటాహుటీన ప్రమాద స్థలికి బయలుదేరారు. హైదరాబాదులో ఉన్న ఆయన రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉంటే, ప్రమాద స్థలికి సమీప ప్రాంతంలోనే ఉన్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక వైకాపా సీఎల్పీ ఉపనేత జ్యోతుల నెహ్రూ కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, ఎస్పీ రవిప్రకాశ్ లు ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News