: బీహార్ ఎన్నికల్లో శివసేన ఒంటరి పోరు
బీహార్ ఎన్నికల్లో ఆసక్తికర పోరు జరుగుతోంది. బీజేపీని ఓడించేందుకు మహాకూటమి కంకణం కట్టుకుంటే, మహాకూటమిని ఓడించేందుకు సమాజ్ వాదీ, బీజేపీలు ఇతర పార్టీలతో కలిసి పావులు కదుపుతున్నాయి. ఇంతలో బీహార్ ఎన్నికల్లోకి ఊహించని విధంగా ఎంఐఎం ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలలోకి దిగుతున్నట్టు ఎంఐఎం ప్రకటించిన మరుసటి రోజే మహారాష్ట్రకు మాత్రమే పరిమితమైన శివసేన కూడా, తాను కూడా బీహార్ ఎన్నికల బరిలో ఒంటరిగా దిగుతానని ప్రకటించింది. దీంతో బీహార్ ఎన్నికలపై ఆసక్తి రేగుతోంది. మతతత్వ పార్టీ అయిన బీజేపీని నిలువరించేందుకే బరిలో దిగుతున్నామని ఎంఐఎం ప్రకటిస్తే... మతతత్వ పార్టీ అయిన ఎంఐఎంను నిలువరించేందుకే ఎన్నికల బరిలో దిగుతున్నట్టు శివసేన వర్గాలు పేర్కొంటున్నాయి.