: బీజేపీ కేంద్రం నాగ్ పూర్: సీపీఐ నారాయణ
'బీజేపీ కేంద్రం నాగ్ పూర్' అంటూ సీపీఐ నేత నారాయణ ఎద్దేవా చేశారు. నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయమే ఎన్డీయే హెడ్ క్వార్టర్స్ అని ఆయన చెప్పారు. టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీలు రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రత్యేకహోదా కోసం రాష్ట్రంలో పోరాడితే ఏం వస్తుందో చెప్పాలని ఆయన మూడు పార్టీల నేతలను ప్రశ్నించారు. చేతనైతే ప్రత్యేకహోదా అని చెబుతున్న పార్టీలన్నీ ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానాలు చేయడంతోనే సరిపెడితే సరిపోదని, మోదీ కాళ్ల దగ్గర మోకరిల్లడం మానాలని ఆయన సూచించారు. 'రండి, అందరం కలిసి ఢిల్లీలో పోరాడుదామ'ని ఆయన పిలుపునిచ్చారు.