: గొడవ పడ్డాడని కుక్కలతో కరిపించింది
తనతో గొడవ పడ్డాడన్న కోపంతో ఓ వ్యక్తిని కుక్కలతో కరిపించిందో మహిళ. అమెరికాలోని న్యూయార్క్ లోని బ్రాంక్స్ అపార్ట్ మెంట్స్ లో ఫ్రాన్సిస్కో బోవ్ (62) చర్చికు వెళ్తుండగా, సింతియా ఒలివర్ అనే మహిళ తన రెండు కుక్కలను అతనిపైకి ఉసిగొల్పింది. దీంతో ఆ కుక్కలు అతనిని చీల్చిచెండాడాయి. రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాయి. దీనిని చూసిన స్థానికులు వాటిని తరిమి బోవ్ ను రక్షించారు. అప్పటికే బోవ్ తీవ్రంగా గాయపడ్డారు. అతనిని వెంటనే అసుప్రతికి తరలించారు. అనంతరం అతని కుమారుడు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఒలివర్ ను ప్రశ్నించగా, బోవ్ తనతో గొడవపడ్డారని, అందుకే అతనిపై కుక్కలని ఉసిగొల్పానని సమాధానం చెప్పింది. కాగా, ఆమె ఎవరో తనకు తెలియదని, ఆమెను అంతకుముందెప్పుడూ చూడలేదని బోవ్ పేర్కొంటున్నారు.